♪♫
TG-3260
Telugu
దేవా నీ గొప్పకార్యములన్
Devaa Nee Goppa Kaaryamulan
0
views
పల్లవి
దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం హల్లెలూయా నా యేసురాజ హల్లెలూయా నా ప్రాణనాథ (2) స్తుతులు మహిమ ఘనత నీకే (2) ||దేవా నీ||
1వ చరణం
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి పరమును వీడి భువికరుదెంచి కలువరి సిలువలో రక్తము కార్చి నీదు కృపతో నను రక్షించిన నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరింతున్ జీవిత కాలమంతా ||దేవా నీ||
2వ చరణం
నీ కంటిపాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను దాచి నీ అరచేతిలో నను చెక్కుకొని నీదు సొత్తుగా నను చేసుకొని అక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇలలో చాటెదను ||దేవా నీ||