TG-3454
Telugu

ఇదే నా హృదయ

Idhe Naa Hrudhaya

0
views
పల్లవి

ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన (2) నిన్ను చూడాలని – నిన్ను చేరాలని (2) నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా||

1వ చరణం

నీ యందు నిలిచి ఫలియించాలని నీ అడుగు జాడలోనే నడవాలని (2) ఈ లోక ఆశలన్ని విడవాలని (2) నీ సువార్తను ఇలలో చాటాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2) యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2) ||ఇదే నా||

2వ చరణం

ప్రతి వారు నీవైపు తిరగాలని ప్రతి వారి మోకాలు వంగాలని (2) ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని (2) ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2) యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2) ||ఇదే నా||

3వ చరణం

ప్రతి చోట నీ పాట పాడాలని ప్రతి చోట నీ సువార్త చేరాలని (2) ప్రతి వారికి రక్షణ కావాలని (2) ప్రతి వారు నీ సన్నిధి చేరాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2) యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2) ||ఇదే నా||