TG-3312
Telugu

ఎడబాయని నీదు కృప

Edabaayani Needu Krupa

0
views
పల్లవి

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2) నన్నెంతగానో బలపరచెను నన్నెంతగానో స్థిరపరచెను (2) నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరచెను (2) ||ఎడబాయని||

1వ చరణం

కన్నీటి లోయలలో నుండి నన్ను దాటించిన దేవా సింహాల బోనులలో నుండి నన్ను విడిపించిన ప్రభువా (2) ||నన్ను బలపరచెను||

2వ చరణం

నేనున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే (2) ||నన్ను బలపరచెను||

3వ చరణం

నేనెదుర్కొనలేని పరిస్థితులు నా ఎదుట ఉన్నవి దేవా నీ శక్తిని నేను కోరెదను నన్ను విడిపించు నా దేవా (2) ||నన్ను బలపరచెను||