TG-2150
Telugu

యెహోవా మా కాపరి యేసయ్య

yehoovaa maa kaapari yeesayya

71
views
పల్లవి

యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా||

1వ చరణం

వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2) మా ప్రాణములు సేదదీర్చేను నీతి మార్గమున నడిపించెను ||యెహోవా||

2వ చరణం

కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను మా తోడు నీడై నిలిచి నడచెను శత్రు పీఠమున విందు చేసెను పరిశుద్ధాత్మలో ముంచి వేసెను పరమానందము పొంగిపోయెను పరలోకములో గొరియపిల్లను నిరతము మేము కీర్తింతుము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.