♪♫
TG-4648
Telugu
ఈ దినమెంతో శుభ దినము
Ee Dinamenthoo Shubha Dinamu
0
views
పల్లవి
ఈ దినమెంతో శుభ దినము నూతన జీవితం అతి మధురం ఆగదు కాలం మన కోసం గతించిపోయెను చెడు కాలం వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో||
1వ చరణం
నీ హృదయం ఆశలమయము కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2) యేసుని కొరకై తెరచిన హృదయం ఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో||
2వ చరణం
జీవితమే దేవుని వరము తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2) నూతన జీవము నింపుకొని నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో||