♪♫
TG-5388
Telugu
నేనే భయపడ వలదని పలికెను
Neenee Bhayapada Valadani Palikenu
0
views
పల్లవి
నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసుప్రభు 1. తన సమాధానము నీ కిచ్చి - కృపల నెన్నో చూపెనుగా తనివి తీర స్తుతి చెల్లించుము - తనదు ప్రేమదయకొరకు 2. శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగి విశ్వాసముతో నిలచిన యెడల - శాశ్వత రాజ్యం బొసగు 3. నరుడుకాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకు కరుణతో నిను రక్షించుటకు - సర్వమిచ్చెను శ్రీ యేసు 4. మరణించెను ప్రభు నీ కొరకే - తిరిగి లేచెను కాపాడన్ త్వరగ వచ్చును కనిపెట్టుము - నిరతమాయనతోనుండ 5. ఎంత పాపివైన నిలలో - చింత లేదిక నమ్మినచో వింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె 6. నీదుయాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహరక్తమును ముదముతో అర్పించిన ప్రభుకే - హల్లెలూయా పాడుము