నేనే భయపడ కూడదనెను ఆ ఆ ఆ
Neenee Bhayapada Koodadanenu Aa Aa Aa
నేనే భయపడ కూడదనెను ఆ ఆ ఆ ఆ - ఆ - ఆ శిష్యులను ధైర్యపరచిన వాడతడే 1. ఐదు రొట్టెలు రెండు చేపలతోనే - ఐదువేలను పోషించినవాడే అద్దరికి వెళ్ళ నాజ్ఞాపించిన ప్రభువే - ప్రేమించిన వాడే 2. గాలి యెదురైన ధైర్యము విడువకు - అన్నియు మేలుకై సమకూడి జరుగును అంతము వరకు తోడుగ నుండును - మొరలిడి కలవరపడకుడి 3. లోకములో మీకు శ్రమలే కలుగున్ - శ్రమలే సహజము నరులందరికిన్ శ్రమలో ధైర్యము కలిగించుటకై - వాగ్దానము లన్నియు నిచ్చెను 4. ఆయనే దేవుడు ఊరక యుండుడి - ఆయననే యెరుగుడి మీరు ఉన్నతుడాయనే అన్యజనులలో - మహోన్నతుడు భూజనములలో 5. కలవర పడకుండని నడువుచు తనబిడ్డల నాదరించినవాడే పరిశుద్ధాత్ముని అందర కొసగి - కృపజూపిన మహాప్రభుండే 6. యుద్ధము చేయును యెహోవా - స్తుతించుట మన విధి యగును యుద్ధాయుధము ఆత్మీయమైనది - ఆయనకే స్తుతి హల్లెలూయా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.