TG-5390
Telugu

నేర్చుకొనరే యేసు వాడుకలను దినము

Neerchukonaree Yeesu Vaadukalanu Dinamu

0
views
పల్లవి

నేర్చుకొనరే యేసు వాడుకలను దినము మీ బ్రతుకునందున నేర్చుకొనిన మీరలాయన జనముగ నొప్పుదురు ఇలలో ||నేర్చుకొనరే||

1వ చరణం

1.  ఆలయ ఆరాధనలకు బోయెడియలవాటుగలిగియు చాలమారులు ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక ||నేర్చుకొనరే||

2వ చరణం

2.  దేవవాక్య పఠనమందున దీక్షగలిగియు మరియ సుతుడు దివ్యముగ నా గ్రంథ పఠనము జేసినవిధంబు మీరలు ||నేర్చుకొనరే||

3వ చరణం

3.  పరమ తండ్రికి ప్రార్థనలు ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను ప్రార్ధించి మనలను నిరతమును ప్రార్ధింపమనెను ||నేర్చుకొనరే||

4వ చరణం

4.  బీద పాపులు బాధితులు బంధింపబడిన వారి కెల్లను ఆదరము జూపించి మేలును జేసిన విధంబు మీరలు ||నేర్చుకొనరే||

5వ చరణం

5.  సువార్త ప్రకటనజేయుట సుభాగ్యముగ దానెంచి యీ భువి సేవలో సువార్త జాటుచు సంచరించిన యేసు వాడుక ||నేర్చుకొనరే||

6వ చరణం

6.  అక్కరలలో దన్నుజేరి మక్కువతో బ్రార్ధించి వేడిన పెక్కు జనముల యక్కరలను జక్కగ దీర్చిన విధంబును ||నేర్చుకొనరే||

7వ చరణం

7.  దైవచిత్తము దీర్చుటయే తన ధర్మ విధిగ నెరిగి యాయన ధరణిలో నా ధర్మమునకై మరణమొందిన విభుని మాదిరి ||నేర్చుకొనరే||