నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు
Neenee Unnavaadananina Advitheeya Prabhu Aaraadhinthu
నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు 1. ఆర్ఫాయు ఓమేగ వర్తమాన - భూత భవిష్యత్తులో నున్నవాడా నా సర్వము నిర్వహించువాడా - సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పింతు నీకే నా ఆరాధన 2. ఏడు సువర్ణ దీపస్తంభముల - మధ్య సంచరించుచున్నవాడా శుద్దీకరించితివి నన్ను - మేలిమిగ మార్చి సంఘమున చేర్చితివి నిన్నే ఆరాధింతు 3. తెల్లని ఉన్నిని పోలియున్న - వెంట్రుకలు కలిగి యున్నవాడా ఆలోచనకర్త నీవే నాకు - జ్ఞానమైతివి అసమానుండ అర్పింతు నీకే నా ఆరాధన 4. సూర్యుని వంటి ముఖము కలిగి - అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగి దృష్టించితివి నా హౄదయమున్ - దహించితివి దుష్టత్వము ప్రేమగల ప్రభూ నిన్నారాధింతు 5. అపరంజిని పోలిన పాదములు - కలవాడా తీర్పు తీర్చితివి పాపము లోకములనిల - దుష్ట సాతానున్ సిలువలొ గెలిచి విజయ మిచ్చినందుల కారాధింతున్ 6. నీ నోటినుండి బయలువెడలె - రెండంచులు గల వాడి ఖడ్గము అదియే పాత ఆదామును చంపె - నశింప చేసె నా శత్రుబలమున్ అర్పింతు నీకే నా ఆరాధన 7. ఏడు నక్షత్రములు పట్టుకొనిన - మొదటివాడా కడపటివాడా సర్వ సంపూర్ణత నాకిచ్చితివి - అపాయములలో ఆదుకొనుచున్న ఆమేన్ అనువాడా హల్లెలూయ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.