TG-4638
Telugu

ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని

Ee Gudiyandu Praveeshinpan Yeesuni

0
views
పల్లవి

ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని బిలువగ రారండి ఆయన రానిదె దీవెనలు ఆశీర్వాదము లరుదగును ||ఈ గుడి||

1వ చరణం

1.  ఆకా శము మన దేవునికి అత్యున్నత సింహాసనము పాదములకు యీ భూమియును పీఠముగా నొప్పును సుమ్ము ||ఈ గుడి||

2వ చరణం

2.  ఆయన సన్నిధి కాంతియె యీ ఆలయమంతట నిండుకొనన్ ఆయన యాత్మ సహాయమున ఆరాధనలను జరుపుటకై ||ఈ గుడి||

3వ చరణం

3.  నిర్మలమైన సువార్తను బో ధింపగ సాయము జేయుటకు బోధకు లైన సువార్తికుల బోధను నాటగ జేయుటకు ||ఈ గుడి||

4వ చరణం

4.  ప్రార్థన విశ్వాసాయుతమౌ భక్తిని నేర్పెడి నిలయముగ భక్తులు దేవుని సన్నిధిలో బాగుగ స్థిరపడ జేయుటకు ||ఈ గుడి||

5వ చరణం

5.  ఈ పట్టణమున వెలుగుటకు ఈ ప్రజలందరి రక్షణకు ఈ గుడి యీ సభ బలపడుచు సాగుచు వృద్ధిని జెందుటకు ||ఈ గుడి||

6వ చరణం

6.  బాప్తిస్మము నిర్ధారణలు ప్రభు భోజన సంస్కారములు బాగుగ జరుగుచుండుటకు భక్తిని పెంపొదించుటకు ||ఈ గుడి||

7వ చరణం

7.  తండ్రి కుమార శుద్ధాత్మకు తావుగ నీ గుడియుండుటకు త్రేకుని దీవెన వర్షములు దీనిపై నిరతము కురియుగాక ||ఈ గుడి||