TG-1862
Telugu

కవులకైనా సాధ్యమా నీ కృపను

kavulakainaa saadhyamaa nee krupanu

50
views
పల్లవి

కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా||

1వ చరణం

చెదరిన మనసులకూ శాంతి కృంగిన హృదికీ ఓదార్పు మృత్యు దేహముకూ జీవం బలహీనులకు ఆరోగ్యం (2) పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు మోసపూరిత ఈ లోకంలో ఏ వైద్యునికి సాధ్యము (2) ||కవులకైనా||

2వ చరణం

క్షణికమైన అనురాగాలు ఆవిరివంటి ఆప్యాయతలు అవసరాల అభిమానాలు నిలచిపోయే అనుబంధాలు నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం స్వార్ధపూరిత ఈ లోకంలో ఏ మిత్రునికి సాధ్యము (2) ||కవులకైనా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.