ఈయనా యేసు రక్షకుడు
Eeyanaa Yeesu Rakshakudu
ఈయనా యేసు రక్షకుడు తన దాయమని రక్షింపఁ దలఁచెనా నన్ను నీయనా యేసు రక్షకుఁడు ఆయాసమగు నొక్క మోపు నే మోయలేకుండ నా మూపుపై నుండ శ్రేయఃకరపు సిలువఁజూపి నాకు హాయి నిచ్చెను భార మంత వెడలించి ||ఈయనా||
1. దురితాత్ముఁడని త్రోయకుండ నన్నుఁ బరిశుద్ధుఁడా యేసు ప్రభుఁడు కరుణింప ధరణిలో నిది మహాద్భుతము నే మరుతునా యీ ప్రేమ మరణమౌ దాఁక ||ఈయనా||
2. ఓపఁగూడని దుష్కృతంబుల్ నేను తేపతేపకుఁ జేసి ద్వేషినై యుండఁ గోప మింతైన రానీక నన్నుఁ గాపురుషుఁ డని తాను ఖండింపఁ డాయె ||ఈయనా||
3. మనస్తమో గుణము లెడబాపెన్ నా దినకరోదయ మట్లు దీప్తిమది మించెన్ తన పాదములఁ జాడ లబ్బెన్ సదా వినుతి కెక్కిన వాని విమలాత్మ వెలుఁగు ||ఈయనా||
4. హతుఁ డయ్యె నాయేసు నాకై దు ర్గతి తొలఁగి నాకు మో క్షమే గల్గు కొఱకు అతి దయాదీర్ఘశాంతుండే దైవ సుతుఁ డని యెఱిగితి శోధింపఁగాను ||ఈయనా||
5. దీవింపఁదగు నతని సిలువ నా జీవాంతమగు దనుక చెలఁగి మోయుచును ఈ వసుంధర జనుల కెల్ల మీరు సేవించుఁ డేసునని చెప్పి చాటుదును ||ఈయనా||