♪♫
TG-4072
Telugu
పలుకలేని నాక
Palukaleni Naaku
0
views
పల్లవి
పలుకలేని నాకు పాట నేర్పినావు చేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావు మనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు (2) యేసయ్యా స్తోత్రమయా యేసయ్యా స్తోత్రమయా ||పలుకలేని||
1వ చరణం
కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావు నా తల్లి మరచినా నేను మరువనన్నావు (2) ప్రతి ఉదయం వేకువనే ఎదురు చూచు ప్రియుడవు నీవు (2) ప్రతి క్షణము కాపరివై కాయుచున్న దేవుడ నీవు (2) ||యేసయ్యా||
2వ చరణం
అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీది వెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది (2) ప్రతి పగలు మేఘమై నీడనిచ్చుఁ దేవుడ నీవు (2) ప్రతి రాత్రి దీపమై వెలుగునిచ్చుఁ దేవుడ నీవు (2) ||యేసయ్యా||