TG-4071
Telugu

పైనున్న ఆకాశమందునా

Painunna Aakaashamandunaa

0
views
పల్లవి

పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా (2) లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన – (2) ||పైనున్న||

1వ చరణం

అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామము (2) యేసు నామములో శక్తి కలదు (2) దోషులకు శాశ్వత ముక్తి కలదు (2) ||పైనున్న||

2వ చరణం

అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవము (2) నాశనమునకు జోగేడి వారికి (2) యేసు నామమే రక్షణ మార్గము (2) ||పైనున్న||

3వ చరణం

యేసు నామము స్మరియించగానే మనసు మారి నూతనమగును (2) బేధమేమియు లేదెవ్వరికిని (2) నాథుని స్మరియించి తరింప (2) ||పైనున్న||