♪♫
TG-4747
Telugu
ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
Ekkadoo Manasu Vellllipooyindi
0
views
పల్లవి
ఎక్కడో మనసు వెళ్ళిపోయింది ఏమిటో ఇటు రానే రానంది ఆహాహా.. ఓహోహో… నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2) అక్కడే చిక్కుకుపోయానంటుంది బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2) ||ఎక్కడో||
1వ చరణం
జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2) దేనికీ ఇక చోటే లేదంది యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2) ||ఎక్కడో||
2వ చరణం
ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2) అక్కడే కరిగిపోతానంటుంది ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2) ||ఎక్కడో||