♪♫
TG-5435
Telugu
పరలోక రాజ్యము చేరుటకు ప్రభుయేసే మార్గంబు
Paralooka Raajyamu Cheerutaku Prabhuyeesee Maarganbu
0
views
పల్లవి
పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను 1. సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీ యేసు పరిశుద్ధ రక్తము చిందించి - బలియాయెను శ్రీ యేసు 2. పాపపరిహారార్థము - పావన రక్తము నిచ్చిన యేసుని చేర ప్రియుడా - సంశయమదియేల 3. నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసుని నాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా 4. మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెను మహిమా ప్రభావముతో యేసు - మరణము గెల్చెను 5. తక్షణమే మారు మనస్సు - నొంది యేసును నమ్మిన రక్షణ నొందెదవు - నిశ్చయముగనో – ప్రియుడా