TG-3783
Telugu

నా యేసయ్య ప్రేమ

Naa Yesayya Prema

0
views
పల్లవి

నా యేసయ్య ప్రేమ నా తండ్రి గొప్ప ప్రేమ (2) వర్ణించగలనా నా మాటతో నే పాడగలనా క్రొత్త పాటతో (2) ||నా యేసయ్య||

1వ చరణం

నా పాపనిమిత్తమై సిలువనూ తానే మోసే ఈ ఘోర పాపి కొరకై తన ప్రాణము అర్పించెనే (2) ఏముంది నాలో దేవా ఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య||

2వ చరణం

తప్పి పోయిన నన్ను వెదకి రక్షించితివే ఏ దారి లేక ఉన్నా నీ దరికి చేర్చితివే (2) ఏముంది నాలో దేవా ఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య||