♪♫
TG-3780
Telugu
నా తనువు నా మనస
Naa Thanuvu Naa Manasu
16
views
పల్లవి
నా తనువు నా మనసు నా నైపుణ్యం నీ కొరకే నా తలంపులు నా మాటలు నా క్రియలు నీ కొరకే నా ప్రయాసే కాదు నీ కరుణతో నిలిచింది ఈ జీవితం నీ నామం కీర్తించాలని నీ బలం చూపించాలని అందుకేగా నన్నిలలో నియమించితివి నీ స్వరూపముగా నీ శ్వాసతో నను సృజియించితివి నీ మహిమగా నేనుండుటకు నీతోనే జీవించుటకు (2) అందుకేగా నన్నిలలో సృజియించితివి అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||
1వ చరణం
గర్భ వాసమున లేనప్పుడే నన్ను ప్రతిష్టించితివి నీ వెలుగునే ప్రకాశించుటకు నీ ప్రేమనే పంచుటకు (2) అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.