నా యెడల నీకున్న
Naa Yedala Neekunna
నా యెడల నీకున్న తలంపులన్ని (2) ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2) అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2) నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య నాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల||
రాజువైన నీవు దాసుడవయ్యావా దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2) అభిషేకించావు అధికారం ఇచ్చావు (2) పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2) ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2) సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2) నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే (2) నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు (2) నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.