♪♫
TG-4154
Telugu
పువ్వు విరిసి రాలినా
Puvvu Virisi Raalinaa
0
views
పల్లవి
పువ్వు విరిసి రాలినా పరిమళంబు మిగులును (2) జీవ నీవే తెలుసుకో నీ జీవితం ఏపాటిదో ||పువ్వు||
1వ చరణం
ధరలో కలిమి లేములు దరి చేరగానే కరగిపోవును (2) దూరపర్చుమా లౌకికం చేరు యేసును శీఘ్రమే ||పువ్వు||
2వ చరణం
పుడమిలో ఫలియించుమా ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2) నేల రాలిన పువ్వులా తేలిపోకుమా గాలిలోన ||పువ్వు||
3వ చరణం
భువిలో బ్రతుకుట కన్నను భగవంత సన్నిధి పెన్నిధి (2) భారమనక పిలువవే కోరుకో నువ్వు క్రైస్తవా ||పువ్వు||