TG-4157
Telugu

రాజా నీ సన్నిధి

Raajaa Nee Sannidhi

23
views
పల్లవి

రాజా నీ సన్నిధి-లోనే దొరికెనే ఆనందమానందమే జీవా జలముతో పొంగే హృదయమే పాడే స్తుతియు స్తోత్రమే శ్రమల వేళా నీ ధ్యానమే నా గానం ఆధారం ఆనందమే నిలువని సిరుల కన్ననూ క్షయమౌ ప్రేమ కన్ననూ విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే నిలువని సిరుల కన్ననూ క్షయమౌ ప్రేమ కన్ననూ విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే ||రాజా||

1వ చరణం

మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం నిలువదాయె పాప శాపాల భారం (2) నీలో నిలిచి ఫలియించు తీగనై ఆత్మ ఫలము పొందితినే ||నిలువని||

2వ చరణం

తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం (2) నీకై నిలిచి ఇలలోన జీవింప ఆత్మ ఫలము పొందితినే ||నిలువని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.