TG-4158
Telugu

రాజా నీ సన్నిధిలోనే

Raajaa Nee Sannidhilone

19
views
పల్లవి

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2) నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా (2) నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2) ||రాజా||

1వ చరణం

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును (2) నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ||నేనుండలేనయ్యా||

2వ చరణం

ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2) ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు (2) నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2) ||నేనుండలేనయ్యా||

3వ చరణం

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా (2) విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2) నిన్ను మించిన దేవుడే లేడయ్యా (2) ||నేనుండలేనయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.