TG-4748
Telugu

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు

Etu Choochinaa Yuddha Samaachaaraalu

0
views
పల్లవి

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువూ భూకంపాలు ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఓ సోదరా ఓ సోదరీ (2) రాకడ గురుతులని తెలుసుకోవా తినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు||

1వ చరణం

మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ యోవాబుని సేవకులు దండులో నుండగను (2) తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2) ఇది సమయమా.. ఇది సమయమా.. అని ఆనాడు ఊరియా దావీదునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||

2వ చరణం

నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము పాడైపోయెను పాడైపోయెను (2) యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2) సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||

3వ చరణం

ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2) ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2) తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు ||ఎటు||