ఆద్యంతరహితుడవు అదృశ్యరూపుడవు
Aadyantharahithudavu Adrushyaroopudavu
ఆద్యంతరహితుడవు అదృశ్యరూపుడవు (2) ఏ చోట నిన్ను కనుగొందునూ ఎలా నిన్ను దర్శింతును (2) నీలి గగనాన నేనెగిరినా గొప్ప సంద్రాలపై సాగినా కొండ శిఖరాలనే ఎక్కినా లోయ లోతుల దిగి వచ్చినా (2) నది తీరాల నడయాడినా జలరాసులనే ఈదిన కారడవుల తిరుగాడినా కొండ గుహలను తడువాడినా మంచు ఖండాల పరికించినా ఎడారులలో పయనించినా ఈ ధృవమందు నే నిలిచినా ఆ ధృవమందు నే పిలిచినా (2) భూమి లోతుల శోధించినా భూరేఖలపై వెదకినా ఉదయ సంధ్యలు వీక్షించినా ఊహలలో విహరించినా ఒంటరినై నేనుండగా నా గతమంత కదలాడగా నా బ్రతుకంత కనిపించగా కన్నీరే ప్రవహించగా (2) దీన మనస్సున ప్రార్థించగా నీదు వాక్యము చెబూనగా నీ కృప నన్ను కరుణించగా నీ మహిమే నను తాకగా నా గుండె గుడిలోన కనుగొంటిని నీ వెలుగు నేనే దర్శించితి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.