ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం
Aanandan Santhooshan Mana Hrudiloo Uthsavan
ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం (2) నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని (2) ||ఆనందం||
లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగివచ్చాడు అంధకార బంధకాలు అంతరింప చేయుటకు ఆశ్చర్యకరుడైనాడు (2) నెరవేరే ప్రవచనమే రక్షకుడు పుడతాడని ధన్యమాయే ధరనిఅంతా యేసయ్యను పూజింపగను (2) నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని (2) ||ఆనందం||
నరకమును తప్పించి నరులను కాపాడా నరునిగా జన్మించాడు మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడై ఇలా పుట్టాడు (2) ఆశ్రయమే ఆధారమే అందరికి ప్రభుడాయెనే భూజనమా హృదినివ్వుమా అదియేగా నిజమైన క్రిస్మస్ (2) నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని (2) ||ఆనందం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.