TG-4874
Telugu

గుండె బరువెక్కిపోతున్నది

Gunde Baruvekkipoothunnadi

0
views
పల్లవి

గుండె బరువెక్కిపోతున్నది ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2) నా మనసేమో కలవరపడుచున్నది (2) యేసయ్యా.. ఆదరించ రావా యేసయ్యా.. బలపరచ రావా ||గుండె||

1వ చరణం

ప్రాకారము లేని పురముగా నేనుంటిని ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2) నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2) యేసయ్యా.. ఆధారం నీవే కదా యేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె||

2వ చరణం

అంధకారంలో నా దీపము ఆరిపోయెనే అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2) దినదినము నేను కృంగుచున్నాను (2) యేసయ్యా.. వెలిగించగ రావా యేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె||

3వ చరణం

ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే (2) ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా (2) యేసయ్యా.. దర్శించ రావా యేసయ్యా.. ప్రేమతో నింపుమయా ||గుండె||