♪♫
TG-3442
Telugu
హీనమైన బ్రతుకు నాది
Heenamaina Brathuku Naadi
0
views
పల్లవి
హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2) దాపు జేరితిని శరణు కోరితిని దిక్కు నీవే నాకు ఇలలో లేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన||
1వ చరణం
మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2) కరుణించి నన్ను కష్టాలు బాపు (2) కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన||
2వ చరణం
తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2) పాపి కొరకు ప్రాణమర్పించిన (2) త్యాగ శీలివి నీకే స్తోత్రము ||హీనమైన||
3వ చరణం
నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2) వెరువను జడియను (2) నీ కంటి పాపను నను కాచే దైవమా ||హీనమైన||