TG-3231
Telugu

క్రిస్మస్ కాలం క్రీస్తు

Christmas Kaalam Kreesthu

0
views
పల్లవి

క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2) ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం||

1వ చరణం

పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2) యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2) ||క్రిస్మస్ కాలం||

2వ చరణం

కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2) దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2) ||క్రిస్మస్ కాలం||

3వ చరణం

ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2) ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం||