నర జన్మమెత్తి వరసుతునిగా
nara janmametti varasutunigaa
నర జన్మమెత్తి వరసుతునిగా అరుదెంచె నేడు సరసముగా శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి క్రీస్తేసు స్వామి ఈ భువిలోన మానసవేది పావనమూర్తి మానవులను పాలించుకర్త నర జన్మమెత్తి… లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ మెత్తి కన్య మరియ గర్భవతియాయే (2) ||మానసవేది||
బంతి యనగ యాడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు (2) ముత్తిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స (2) ప ద ని స.. ప ద ని స.. ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి||
జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి (2) ||ముత్తిక||
జననము నొందెను జయ యేసు జయ గీతములు పాడుడి (2) ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపినట (2) ||జననము||
శ్రీ యేసుండు జన్మించే రేయిలో (2) నేడు పాయక బేత్లెహేమ యూరిలో (2) సత్రమందున పశువుల శాలయందున (2) దేవపుత్రుండు మనుజుండాయెనందున (2) ||శ్రీ యేసుండు||
చూడబోదాము రారే సకల జనంబులార శ్రీ యేసు నాథుని జన్మంబు (2) ఆనందముతో మనమందరం (2) ఆహ ||చూడబోదాము||
ఘల్లు ఘల్లున మనమెల్లి యేసుని పాదంబు జంబులకు మ్రొక్కెదము (2) ||ఆనందముతో||
ఆహ చూడ… ఆహ చూడ… ఆహ చూడబోదాము రారే సకల జనంబులార శ్రీ యేసు నాథుని జన్మంబు (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.