TG-4625
Telugu

ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే

Ilan Puchchukonuta Kanna Nenthoo Yichchutayee

0
views
పల్లవి

ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే ధన్య మన్న తులలేని భక్తి మీర చెలువైన రక్తి దీర నలలారు కూరిమితో మరి పేరి మితో మెలంగినచో నెలమిని బ్రభుఁ డిడుఁ బలు దీవెనల ||ఇ||

1వ చరణం

1.  పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడిచి నడచి కానుకలు నిడి బాలనృపునిమ్రోల పడి మ్రొక్కి మోడ్చి కేలఁ గడు నిత్యభాగ్యమును సౌభాగ్యమును గడించికదా వెడలి రమందానందముతోడ ||ఇ||

2వ చరణం

2.  మును పేద విధవ చాల భక్తి నొనరంగ గుడి చందాలఁ దన జీవనం బై యుండు నెనరాని కాసుల రెండు మనసార నర్పించె సమర్పించె మనశ్శాంతిన్ గని యెను క్రీస్తుని వరముల బడసె ||ఇ||

3వ చరణం

3.  తనయ నీదు హృదయంబు నాకి మ్మనె దేవుఁడె యనయంబు మన సొప్పి మన కానుకల మారాడక మన సకల మును నీయఁ గావలయున్ బ్రభుడాయవలెన్ మనం బలరన్ సణుగక గొణుగక వర్ధిల్లు కొలఁది ||ఇ||