♪♫
TG-3253
Telugu
దేవా మహోన్నతుడా
Devaa Mahonnathudaa
0
views
పల్లవి
దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా (2) పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా (2) ||దేవా||
1వ చరణం
వెలిసావు భువిలో మెస్సయ్యగా ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2) నిస్సారమైన నా జీవితములో చిగురించె ఆనందము (2) ||దేవా||
2వ చరణం
లేచాను ఒంటరి విశ్వాసినై వెదికాను నీ దారి అన్వేషినై (2) నీ దివ్య మార్గము దర్శించినా ఫలియించె నా జన్మము (2) ||దేవా||