TG-3492
Telugu

జై జై యేసు రాజా

Jai Jai Yesu Raajaa

0
views
పల్లవి

జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై – (2) ||జై జై||

1వ చరణం

పాపకూపములో బడియున్న (2) నన్ను జూచి చేయి జాచి (2) చక్కగ దరికి జేర్చితివి (2) ||జై జై||

2వ చరణం

సిలువ రక్తములో నన్ను కడిగి (2) పాపమంతా పరిహరించిన (2) పావనుడగు నా ప్రభుయేసు (2) ||జై జై||

3వ చరణం

నీతి హీనుడనైన నాకు (2) నీతి రక్షణ వస్త్రములను (2) ప్రీతితో నొసగిన నీతి రాజా (2) ||జై జై||

4వ చరణం

మంటి పురుగునైన నన్ను (2) మంటి నుండి మింట జేర్చిన (2) మహాప్రభుండా నీకే జై జై (2) ||జై జై||

5వ చరణం

పాపశాపగ్రస్తుడనై యుండ (2) నన్ను గూడ నీ స్వకీయ (2) సంపాద్యముగా జేసితివి (2) ||జై జై||

6వ చరణం

రాజులైన యాజక గుంపులో (2) నన్ను గూడ నీ సొత్తైన (2) పరిశుద్ధ జనములో జేర్చితివి (2) ||జై జై||

7వ చరణం

తల్లియైన మరచిన మరచును (2) నేను నిన్ను మరువననిన (2) నమ్మకమైన నా ప్రభువా (2) ||జై జై||

8వ చరణం

అధిక స్తోత్రార్హుడవైన (2) ఆది యంతము లేని దేవా (2) యుగా యుగములకు నీకే జై జై (2) ||జై జై||