సీయోను పాటలు సంతోషముగా పాడుచు
seeyoonu paatalu santooshamugaa paaduchu
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు ||సీయోను||
ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి ||సీయోను||
మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము ||సీయోను||
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి ||సీయోను||
ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై ||సీయోను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.

