కొనుము మా హృదయంబులను
Konumu Maa Hrudayanbulanu
కొనుము మా హృదయంబు లను నీకర్పించెద మనయము నుతి యించుచు ఘనముగాఁ గృపచేత మముఁ గా చినను మే మెంతయు ననర్హుల మనుచు నీ పాదముల కెరగుచు ననిశమును నీ కృపఁ దలంతుము ||కొనుము||
1. బలహీనులము మేము బలవంతుఁడవు నీవు బల మిచ్చి మము నడుపుము ఇలను మే మిఁక బ్రతుకు దివనం బులను నీ పద భక్తిచే నెపుడలయ కుండగ మమ్ముఁ గడు ని ర్మలిన హృదయులఁ జేసి కరుణను ||కొనుము||
2. ఘోరారణ్యము భువి వి చార సంకలితము భూరి భయంకరము దారి లేదిఁక నీవు దప్ప వేరె సాధన మెచెటఁ గానము కోరి మము నందరిని నీదరి జేరుకొను మార్గమును జూపు ||కొనుము||
3. గత వత్సరమున నీ యతులమౌ కృపచేత పతితుల మముఁ గాచితి వతి వినమ్రుల మగుచు మామా మతులలో నీ ప్రేమఁ దలఁచుచు మతి విహీనతే వీడి యిఁక నిను సతతతము సేవింతు మయ్య ||కొనుము||
4. ఈ వత్సరంబున నెవ్వరు మాలోన పోవుదు రిలను విడిచి దేవ వారలు భువిని వదలి పోవు కాలమునందుఁ దిన్నని త్రోవలో వారలను సుఖముగఁ బ్రోవఁ దొడ్కొని పోవు మయ్య ||కొనుము||
5. మమ్మును విశ్వాస మార్గమందున దోడ నిమ్ముగఁ గొని పోవుచు నమ్ము నీ ప్రియ సేవకుల బృం దమ్మునకు సిద్ధంబులగు మకు టమ్ములను మే మొందుటకు వే గమ్ముగాఁ బాత్రులను జేసి ||కొనుము||
6. శోధనల యందున బాధల యందున నోదార్పు మా కొసఁగుము శోధనలచే మాకు మరియును శుద్ధమగు హృదయంబు లిచ్చుచు శోధనల్ ఫలియిపంఁ జేయుము బాధకమ్ములు గాక యుండఁ ||కొనుము||
7. ఈ లోక దుఃఖము లెల్ల నేగిన పిదప నీ లోకమును జేరఁగఁ పాలుమాలక మేము మామా పరుగు నెత్తఁగు సాయ మిమ్మో యేలికా నీ కరములను మ మ్మెపుడు గొని నడువంగ నేర్పు ||కొనుము||
8. దురితంబు లెల్లను గరుణచేఁ గడిగి నీ పరమందు మము జేర్పుము నిరతమును మే మచట నీ కృప విరివి నెంతయు బొగడుచును మా కరములను బంగారు వీణెల వెరవుగాఁ గొని మీటుచుందుము ||కొనుము||