TG-2306
Telugu

నీవు తప్ప నాకీ లోకంలో

neevu thappa naakee lookanloo

78
views
పల్లవి

నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2) దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు||

1వ చరణం

గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరమునీయవా కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు||

2వ చరణం

లోకమంత చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నిలువవా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.