TG-3625
Telugu

లోకమును విడచి

Lokamunu Vidachi

0
views
పల్లవి

లోకమును విడచి వెళ్ళవలెనుగా (2) సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్ ||లోకమును||

1వ చరణం

యాత్రికులము ఈ దుష్ట లోకములో పాడు లోకములో మనకేది లేదు (2) ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేము జాగ్రత్తగానే నడచుకొనెదము (2) ||లోకమును||

2వ చరణం

మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము (2) నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టుదాము (2) ||లోకమును||

3వ చరణం

ఆత్మీయ నేత్రాలతో చూచెదాము ఎంతా అద్భుతమో సౌందర్య నగరం (2) ప్రభువు చెంతకు వెళ్ళెదము (2) వెళ్ళెదము విజయోత్సవముతో ప్రవేశించెదము (2) ||లోకమును||