TG-3623
Telugu

లోకమంతట వెలుగ

Lokamanthata Velugu

0
views
పల్లవి

లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2) లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ॥లోకమంతట॥ నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింప లేదు నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు వాడు చీకటిలో నడువక – (2) జీవపువెలుగై యుండుడనె యేసు ॥లోకమంతట॥ ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె – (2) పిల్లయే దీపమై వెలుగుచుండు ॥లోకమంతట॥ విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక విూరు వెలుగు సంబంధులు విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే మరుగై యుండక నరులందరికి – (2) వెలుగై యుందురనె యేసుండు ॥లోకమంతట॥ చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద ప్రకాశించెను గొప్ప వెలుగు – (2) ప్రభువు యేసుకు జేయని పాడరే ॥లోకమంతట॥ Yesu Janminchinapudu Aakaashamunandu Goppa Nakshathrambu Buttenapudu Loka Gnaanulu Gollalu Velli – (2) Loka Rakshakudesuku Mrokkiri ||Lokamanthata||