TG-363
Telugu

ఓ యేసు భక్తులారా, మీ

oo yeesu bhakthulaaraa, mee

203
views
పల్లవి

ఓ యేసు భక్తులారా, మీ రాజు ధ్వజము గ్రహించి సాహసించి పోరాడి గెల్వుఁడీ విశ్వాసులార, రండి మీ రక్షణార్థమై ప్రయాసపడ్డ యేసు విజయ మిచ్చును.

1వ చరణం

మీయం దసూయఁ బట్టి మీ యాత్మ నాశము నెన్నండుఁ గోరునట్టి యనేకు లుందురు మీ రెల్ల రేసు పేరు వచించి యాయనే సర్వాధికారి యంచు సేవింపవలెను. ||ఓ యేసు||

2వ చరణం

ప్రచండ మైన దండు పోరాడ లేచినన్ విరోధి శక్తి కొద్ది మరీ తెగించుఁడీ స్వకీయ శక్తిఁగాక శ్రీ యేసు నామమున్ స్మరించి వానియందు విశ్వాస ముంచుండీ. ||ఓ యేసు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.