TG-5707
Telugu

లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు

Lookamanthata Velugu Prakaashinchenu Yeesu Janminchinapudu

0
views
పల్లవి

లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి (2) లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ||లోకమంతట||

1వ చరణం

నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింప లేదునేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు వాడు చీకటిలో నడువక (2) జీవపువెలుగై యుండుడనె యేసు ||లోకమంతట||

2వ చరణం

ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె (2) పిల్లయే దీపమై వెలుగుచుండు ||లోకమంతట||

3వ చరణం

విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక విూరు వెలుగు సంబంధులు విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే మరుగై యుండక నరులందరికి (2) వెలుగై యుందురనె యేసుండు ||లోకమంతట||

4వ చరణం

చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులైలోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద ప్రకాశించెను గొప్ప వెలుగు (2) ప్రభువు యేసుకు జేయని పాడరే ||లోకమంతట||