♪♫
TG-5240
Telugu
నాడు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట
Naadu Vachchinatlu Gaadu Neendu Vachchuta
0
views
పల్లవి
నాడు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తు నింకఁ జొత్తు మెచ్చుట ||నాఁడు||
1వ చరణం
1. మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెఁగా యిపుడు కొదమ సింహమయ్యె మనకు గుండె దిగులుగా ||నాఁడు||
2వ చరణం
2. దాసునివలె దొల్లిఁ జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప దొరయైనాఁడుగా ||నాఁడు||
3వ చరణం
3. ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెఁగా పిడుగు రీతి వాని యుగ్రమైన దృష్టి హెచ్చఁగా ||నాఁడు||
4వ చరణం
4. కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి మండు నగ్ని యదిగో వచ్చెఁగా ||నాఁడు||
5వ చరణం
5. దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకుఁ బోయి చెడితిమి ||నాఁడు||
6వ చరణం
6. వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధఁ బొంది నరకాగ్నిలోఁ బడఁబాలైతిమి ||నాఁడు||