భార్త క్రైస్తవ యువజనులారా ప్రభుకై
bhaartha kraisthava yuvajanulaaraa prabhukai
భార్త క్రైస్తవ యువజనులారా ప్రభుకై నిలువండీ భారతరక్షక భటవరులారా ప్రభువును జూపుటకై లెండి ఫలితము గనరండీ ||భార్త క్రైస్తవ||
బాలప్రాయమున్ మీరలెల్ల భక్తి జీవితాసక్తిపరులై అలయోసేపును బోలినవారై బలతర సామర్ధ్యము జూపి ఫలితముగనరండీ ||భార్త క్రైస్తవ||
శోధనాధికము చుట్టునున్న సకల యాశలును నెట్టుచున్న బాధించుచు మరి సాధించెడి యా సైతానుని గెలువగ లెండి ఫలితము గనరండీ ||భార్త క్రైస్తవ||
నమ్మకంబు మదియందు బూని నేర్పుతోడ ప్రభు సేవజేయ రమ్మిదె యేసుని రక్షణ సేవకు రాజితమగు జీవమునొందున్ ఫలితము గనరండీ ||భార్త క్రైస్తవ||
విజయ కాంక్షగలవారలెల్ల వినయ భూషణాసక్తిపరులై నిజమగు క్రైస్తవ నీతిని జూపి నిరతముగ వెలుగుదు రండీ నిజమిది గనుగొనుడీ ||భార్త క్రైస్తవ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.