మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు
నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ
1. భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడు
దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ
2. విజయము మరణపు వేదనపై నొందఁగా
విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ
3. నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు
దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ
4. నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు
కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ
5. దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన
సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ
6. నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు
నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ
7. నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము
నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ
8. దిన దినమును నిన్ను మహిమ పర్చుచున్నాము
ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము ఓ క్రీస్తూ
9. నేఁడు పాపము చేయకుండ నెనరుతో మముఁ గావుమయ్యా
పాడెడి నీ దాసులకుఁ బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ
10.ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము
ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ
11.నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపైఁ జూపుము
మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ
maa yeesu kreesthu neevee mahimagala raajavu neevu
neevee thandriki nithyakumaarudavu oo kreesthoo
1. bhoonarulan rakshinpan boonukoninappudu
deena kanyaagarbhamun diraskarinpaleedugaa oo kreesthoo
2. vijayamu maranapu veedanapai nondangaa
vishvaasulandarikin vippithivi mookshamun oo kreesthoo
3. neevu thandridainatti nithya mahimayandu
deevuni kudivaipun diramugaan goorchunnaavu oo kreesthoo
4. neevu nyaayaadhipathivai nishchayamugaa vachhchhedavu
kaavuna nee saayanbukaanimmu nee daasulaku oo kreesthoo
5. divyamau rakthanbu chindinchi neevu rakshinchina
seevakulakai meemucheeyu manavi naalinchu oo kreesthoo
6. nee vaari nellappudunu nithya mahimayandu
nee parishuddhulathoonu nee venchukonu mayya oo kreesthoo
7. needu janamun rakshinchi nee daayamu deevinchumu
naadhaa vaaralanu neeli leevaneththu meppudunu oo kreesthoo
8. dina dinamunu ninnu mahima parchuchunnaamu
ghanamugaa nee naamamun goppacheeyuchunnaamu oo kreesthoo
9. neendu paapamu cheeyakunda nenaruthoo mamun gaavumayyaa
paadedi nee daasulakun barama daya nimmayya oo kreesthoo
10.prabhuvaa karuninchumu prabhuvaa karuninchumu
praarthinchu nee daasulapai vraalanimmu deevenalan oo kreesthoo
11.ninnu nammi yunnaamu nee krupa maapain joopumu
meemu moosapookunda neevee kaapaadumayyaa oo kreesthoo