♪♫
TG-3698
Telugu
మేలైనా కీడైనా
Melainaa Keedainaa
0
views
పల్లవి
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2) నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా||
1వ చరణం
కలిమి చేజారి నను ముంచినా స్థితిని తలక్రిందులే చేసినా (2) రెండింతలుగా దయచేసెదవని (2) నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||
2వ చరణం
పరుల ఎగతాళి శృతి మించినా కలవరము పొంది నే కృంగినా (2) నా మొర విని కృప చూపెదవని (2) నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||
3వ చరణం
శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటునే తెచ్చినా (2) ఆపదలలో విడిపించెదవని (2) నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||