TG-370
Telugu

నా దేవ ప్రభువా నీ

naa deeva prabhuvaa nee

203
views
పల్లవి

నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను నా కిష్టము ఏవైన శ్రమలు తటస్థమైనను నీ చెంత నుందును నా ప్రభువా

1వ చరణం

ప్రయాణకుండను నడవిలో నా త్రోవఁ జీఁకటి కమ్మినను నిద్రించుచుండఁగా స్వప్నంబునందున నీ చెంతనుందును నా ప్రభువా. ||నా దేవ||

2వ చరణం

యాకోబు రీతిగా ఆ మెట్లను స్వర్గంబుఁ జేరనుఁ జూడనిమ్ము. నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చఁగా నీ చెంతనుందును నా ప్రభువా. ||నా దేవ||

3వ చరణం

నేనిద్రలేవఁగా నా తండ్రి, నే నీకుం గృతజ్ఞతఁ జెల్లింతును. నే చావునొందఁగా ఇదే నా కోరిక నీ చెంతనుందును నా ప్రభువా. ||నా దేవ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.