TG-3697
Telugu

మేఘాల పైన మన యేసు

Meghaala Paina Mana Yesu

0
views
పల్లవి

మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2) సిద్ధపడుమా ఉల్లసించుమా నీ ప్రియుని రాకకై (2) ||మేఘాల||

1వ చరణం

ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు (2) బూర శబ్దం మ్రోగగా ప్రభుని రాకడ వచ్చును రెప్ప పాటున పరిశుద్ధులు కొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల||

2వ చరణం

పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే (2) వినుట వలన విశ్వాసం కలుగును సోదరా దేవుని ఆజ్ఞకు లోబడితే పొందెదవు పరలోకం ||మేఘాల||

3వ చరణం

స్తుతియు మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లు గాక తర తరములకు యుగయుగములు యేసే మారని దైవం (2) నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ ||మేఘాల||