మేలుకో మహిమ రాజు
Meluko Mahima Raaju
మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు (2) పరమునుండి – బూర ధ్వనితో అరయు నేసు – ఆర్భాటముతో (2) సర్వలోకము – తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో||
గురుతులెల్ల – ధరణియందు సరిగ చూడ – జరుగుచుండ (2) చిరునవ్వుతో – చేరి ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో||
క్రీస్తునందు – మృతులెల్లరు కడబూర – మ్రోగగానే (2) క్రీస్తువలె – తిరిగి లేతురు లేతువా? నీవు ప్రియుడా (2) ||మేలుకో||
అరయంగ – పరిశుద్ధులు మురిసెదరు – అక్షయ దేహులై (2) పరమందు – ప్రభుక్రీస్తు నిరతము – ఓ ప్రియుండా (2) ||మేలుకో||
కరుణలేని – ఓ మరణమా నిరతము నీకు జయమగునా (2) మరణ సంహా – రుండేసు త్వరగా – రానై యున్నాడు (2) ||మేలుకో||
మాంసలోక – పిశాచాదులు హింస పరచ – విజృంభించిన (2) లేశమైనను – జడియకుము ఆశతో – కాచుకొనుము (2) ||మేలుకో||
పాపమును – చేయకుమా రేపకుమా – దైవ కోపమును (2) శాపమును – తప్పుకొని శ్రద్ధతో – కాచుకొనుమా (2) ||మేలుకో||