మానవుఁడవై సకల నరుల మానక
Maanavundavai Sakala Narula Maanaka
మానవుడవై సకల నరుల మానక నా దోషముల బాపుటకు బలియైతివే యేసు (2) బహు ప్రేమ తోడ ||మానవుడవై||
నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు (2) నియమంబు నిచ్చి ||మానవుడవై||
నీ శరీరము రొట్టె వలెనె నిజముగా విరువంగబడెనే నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే (2) నా యన్న యేసు ||మానవుడవై||
మంచి యూట మించి దండి పంచ గాయములలో నుండి నిత్య జీవపు టూటలు జేసితి (2) నీ ప్రేమ నుండి ||మానవుడవై||
నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుడంటివి నీ (2) నిజ భక్తి తోడ ||మానవుడవై||
ఎంతో ప్రేమతో బలిగానయితివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప (2) శ్రీ యేసు దేవా ||మానవుడవై||
నిత్య బలియగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను నిముడించుకొని నాలో నీ (2) నిజ రూప మొంద ||మానవుడవై||
నేను నీ బలిలోన గలిసి నేను నీతో గలిసి మెలిసి నేను నీవలె నుండి జేసితివే (2) నా దివ్య యేసు ||మానవుడవై||
నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు పాప భారములు దిగునే (2) నా దివ్య యేసు ||మానవుడవై||
నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి నున్నావే (2) నిజ దేవా యేసు ||మానవుడవై||
నీవే నీ చేతులలో నిత్తువు ఈ నీ బలి విందునకు వత్తువు నిన్ను నిట జూచితిని నా యేసు (2) ఎన్నడును మరువను ||మానవుడవై||