నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము
Neenu Ghoorapaapini Cheeri Veeduchuntini Kshaminchumu
నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము 1. ఆదాము హవ్వలందున ఏదేనులో నే పొందిన ఆది దోషము అంటియుండెనయ్య – దాని నిర్మూలించు యేసయ్య 2. నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే పాపము తోడనే పుట్టితి నేసయ్యా – దాని పరిహరింపుము 3. నా యపరాధము చేతను నే జేసిన పాపమందున సత్యములేక నేజచ్చిన వాడను – ననుజీవింపచేయు యేసయ్యా 4. పాపములు దాచుకొంటిని శాపమును గూర్చుకొంటిని ఆపద గుర్తించ లేక నే గడిపితిని – దాపు జేరితి ప్రాపునీయుము 5. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను పచ్చిపుండ్లు గాయములతో నేసయ్యా – వచ్చి నీ ప్రాపున జేరితి 6. లోకానంద యంద మందున వీకతో వీక్షింపనేగితి దావీదువలె బెత్షెబా బారిలో నుంటి – దేవా విమోచించు యేసయ్యా 7. ఎన్నెనోమార్లు నీ సన్నిధిన్ నేను విడిచి ఏతెంచితి నావలె మీనాగర్భములో నుంటి – నన్ను నీదరిజేర్చు మేసయ్యా