TG-5365
Telugu

నేను కూడా ఉన్నానయ్య

Neenu Koodaa Unnaanayya

24
views
పల్లవి

నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా (2) పనికిరాని పాత్రనని నను పారవేయకు యేసయ్యా (2) జ్ఞానమేమి లేదుగాని నీ సేవ చేయ ఆశ ఉన్నది (2) నీవే నా జ్ఞానమని (2) నీ సేవ చేయ వచ్చినానయ్య (2) ||నేను||

1వ చరణం

ఘనతలొద్దు మెప్పులొద్దు ధనము నాకు వద్దే వద్దు (2) నీవే నాకు ఉంటే చాలు (2) నా బ్రతుకులోన ఎంతో మేలు (2) ||నేను||

2వ చరణం

రాళ్లతో నన్ను కొట్టిన గాని రక్తము కారిన మరువలేనయ్యా (2) ఊపిరి నాలో ఉన్నంత వరకు (2) నీ సేవలో నేను సాగిపోదునయా (2) ||నేను||

3వ చరణం

మోషే యెహోషువాను పిలిచావు ఏలీయా ఎలీషాను నిలిపావు (2) పేతురు యోహాను యాకోబులను (2) అభిషేకించి వాడుకున్నావు (2) ||నేను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.