♪♫
TG-5363
Telugu
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా
Neenantee Neekendukoo Ee Preemaa
0
views
పల్లవి
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా నన్ను మరచి పొవెందుకు (2) నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా.. నా ప్రాణమా (2) ||నేనంటే||
1వ చరణం
నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2) ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4) ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
2వ చరణం
ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2) ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4) ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే||